టి - ఎంపిలతో జానా భేటీ: ప్రాధాన్యత లేదని వ్యాఖ్య

తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం మీదనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వహిస్తానని, పార్టీ నాయకత్వం ఆదేశిస్తే తాను ఉప ఎన్నికల ప్రచారం పాల్గొంటానని ఆయన చెప్పారు.
హైకోర్టు ఇచ్చిన స్టే తొలిగిపోగానే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, స్టే వల్లనే ఆ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారమైతే కాంగ్రెసు పార్టీకి ఎదురు ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి నివారణకు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి జానా రెడ్డి ఢిల్లీకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు. తెలంగాణపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వచ్చారని చెబుతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నాయకులు ఒక్కరొక్కరు ఢిల్లీకి వస్తూ పోతున్నారు.












Click it and Unblock the Notifications