మంత్రిని కిడ్నాప్ చేసిన మావోలు, పోలీసాఫీసర్ హత్య

ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు పోలీసులు శాసనసభ్యుడిని, ఇటాలియన్ టూరిస్టులను, కలెక్టర్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనలు మరిచిపోక ముందే ఛత్తీస్‌గడ్‌లో మంత్రి అపహరణ వ్యవహారం చోటు చేసుకుంది.
ఇదిలా వుంటే, చత్తీస్‌గడ్‌లోని నక్సల్స్ ప్రభావిత జిల్లా కంకేర్‌లో మావోయిస్టులు పోలీసాఫీసర్‌ను కాల్చి చంపారు. ఓ కాంట్రాక్టర్‌పై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. బందే పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ దిలీప కుమార్ సిన్హాను కాల్చి చంపారు.
బందే గ్రామంలోని విధుల నుంచి తిరిగి వస్తుండగా సాయుధ మావోయిస్టులు మోటారు సైకిల్‌పై వచ్చి గత రాత్రి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను మరణించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సరికి మావోయిస్టులు పారిపోయారు. ముగ్గురు మావోయిస్టులు ఎఎస్‌పై ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ కాలికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రిలో చికిత్స నిమిత్రం చేర్చారు.












Click it and Unblock the Notifications