వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి లేకుంటే...: చిరు కుమార్తె ఇంట్లో డబ్బుపై వాసిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma
హైదరాబాద్: ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెసు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుమార్తె ఇంట్లో రూ.36 కోట్ల నగదు దొరికితే కొన్ని పత్రికలు ఆ వార్తకు ప్రాధాన్యత ఇవ్వలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. లెక్కలు చూపని అంత నల్లధనం దొరికిన వార్తని లోపలి పేజులలో చాలా చిన్న వార్తగా ప్రచురించారని ఆమె అన్నారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడికి సంబంధం అనే వార్తను మాత్రం బ్యానర్ చేశారని మండిపడ్డారు. అదే భాను కిరణ్‌తో జయభేరి అధినేత మురళీ మోహన్‌కు సంబంధం ఉంటే వార్తే రాయలేదని అన్నారు. ఇవేనా ఆ పత్రికలు పాటించే జర్నలిజం విలువలు అని ఆమె ప్రశ్నించారు.

సాక్షి పత్రిక లేకపోతే చిరంజీవి అల్లుడి ఇంట్లో డబ్బు దొరికిన విషయం వార్తే అయ్యేది కాదన్నారు. చిరంజీవి వియ్యంకుడికి అంత డబ్బు నగదు రూపంలో ఉంచుకునేంతంటి వ్యాపారాలు ఏమీ లేవని ఆమె అన్నారు. ఆ కుటుంబం ఆర్థికపరంగా ఇటీవల పలు ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబం వద్ద ఇంత డబ్బు నగదు రూపంలో ఉండే అవకాశమే లేదన్నారు.

తన కూతురింట్లో దొరికిన డబ్బుకు సంబంధించి చిరంజీవి పూర్తి స్థాయి విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన సందర్భంగా ఏం జరిగిందో, ఏఏ ఒప్పందాలు జరిగాయో వివరించాలన్నారు. డబ్బు దొరికిన ఇల్లు ఎవరిదనేది ఇంత వరకు అధికారికంగా ప్రకటించక పోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.

చిరంజీవి అత్యవసరంగా ఢిల్లీ వెళ్లి ఈ రోజు వాయలార్ రవిని ఎందుకు కలవవలసి వచ్చిందో చెప్పాలన్నారు. కుమార్తె ఇంట్లో డబ్బు దొరికిన అంశంపై మాట్లాడటానికే ఆయన వెళ్లారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

English summary
YSR Congress leader Party leader Vasireddy Padma said, some leading papers did not gave preference to Rs.36 crores, which are CBI found in Rajyasabha Member Chiranjeevi's daughter residence in Chennai. She said, Jayabheri Murali Mohan have links with Bhanu Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X