జగన్ ఆస్తుల కేసులో శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ కన్ను

ఇందు ప్రాజెక్ట్స్ చైర్మన్ అయిన ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టింది. అతి కొద్ది కాలంలోని ఇందు ప్రాజెక్ట్స్ 2 వేల కోట్ల టర్నోవర్ సాధించడమే సిబిఐ అనుమానాలకు కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందు ప్రాజెక్ట్స్ యేటా వంద శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది.
శ్యాంప్రసాద్ రెడ్డి వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ)ల్లో పెట్టుబడుల పెట్టిన విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిబిఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. అందుకు ప్రతిఫలంగా శంషాబాద్ వద్ద 150 ఎకరాల ఐటి సెజ్ భూములు, అనంతపురంలో లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం 8,800 ఎకరాల భూములు కట్టెబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి భూములు పొందినట్లు చెబుతారు. ఇందు ఫార్చునిస్ ఫీల్డ్స్, ఇందు అరణ్య, ఇందు సిటీ వంటి ప్రాజెక్టులను హైదరాబాదులోని, హైదరాబాదు పరిసరాల్లోనూ చేపట్టారు. లేపాక్షి నాలెడ్జి హబ్ విషయంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి, ఆ భూమి మీద 790 కోట్ల రూపాయల రుణాలు పొందారనే ఆరరోపణలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ఇందు ప్రాజెక్ట్స్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఎపిఐఐసి ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
శ్యాంప్రసాద్ రెడ్డిని సిబిఐ మంగళవారం ప్రశ్నించింది. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. మరోసారి ఆయనను సిబిఐ పిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ ప్రభుత్వ హయాంలో శ్యాంప్రసాద్ రెడ్డి ప్రయోజనాలు పొందినట్లు సిబిఐ అనుమానిస్తోంది.












Click it and Unblock the Notifications