వైయస్ జగన్ వెంట తుపాకి సరఫరాదారులు: విహెచ్

శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఆసాంఘిక శక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని ఆయన అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ తన ఆస్తుల కేసులో కోర్టుకు హాజరు కానున్న విషయం తెలిసిందే. దీనిపైనే హనుమంత రావు ఆ వ్యాఖ్యలు చేశారు.
వాన్‌పిక్ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటే సహించబోమనే సంకేతాలు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ మీడియా ఆస్తుల జప్తునకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోమంత్రి సంతకాలు చేయడం ఆహ్వానించదగిన విషయమని, ఇటువంటి చర్యల వల్ల పేదల పేరు చెప్పి దోచుకోవడానికి ప్రయత్నించేవారికి హెచ్చరిక అందుతుందని ఆయన అన్నారు. అసాంఘిక శక్తులను ఈ నెల 28వ తేదీ లోగా జైలుకు పంపాలని ఆయన అన్నారు.
వైయస్ జగన్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు సంతృప్తికరంగా లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు వినోద్ అన్నారు. జగన్‌తో తమ పార్టీ కుమ్మక్కయిందని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. జగన్‌తో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కుమ్మక్కయ్యారని ఆయన హైదరాబాదులో విమర్శించారు. సిబిఐ దర్యాప్తును పరిశీలిస్తే చట్టం డబ్బున్నవాళ్ల చుట్టం అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications