సాక్షిపై చర్యలు, వైయస్ జగన్ అభిమాని ఆత్మహత్య

Vinod
హైదరాబాద్: తమ పార్టీ నేతపై వేధింపులను భరించలేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అభిమాని ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక రాసింది. జగన్‌పై ప్రభుత్వ వేధింపులను భరించలేక వి. వినోద్ కుమార్ అనే అభిమాని బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ పత్రిక రాసింది. అతను ఓ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు.

సూసైడ్ నోట్ వివరాలను ఇస్తూ వినోద్ కుమార్ ఫొటోను సాక్షి ప్రచురించింది. "జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అనేక రకాలుగా వేధిస్తోంది. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కై ఆయనపై వేధింపులకు పాల్పడుతున్నాయి. నా అభిమాన నేతను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండటం నాకు తీవ్రంగా బాధ కలిగిస్తోంది. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. అమ్మా, నాన్న నన్ను మన్నించాలి" అని సూసైడ్ నోట్ రాసి వినోద్ కుమార్ ఉరేసుకుని మరణించినట్లు ఆ పత్రిక రాసింది.

సాక్షి దినపత్రిక రాసిన వివరాల ప్రకారం - వినోద్ (32) హైదరాబాదులోని మోతీనగర్ సమీపంలోని రాధాకృష్ణనగర్ వాసి. కాంగ్రెసులో ఉండగా అతను వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా ఉండేవారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసులో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. జగన్‌ను కేంద్రంగా చేసుకుని వారం రోజులుగా జరుగుతున్న పలు సంఘటనలతో కలత చెంది ఆయన బుధవారం సాయంత్రం తన ఇండి మేడపై గదిలో మెడకు తాడు బిగించుకుని ఉరేసుకున్నాడు.

వినోద్ కుమార్‌కు భార్య ఇందిర, కుమారుడు స్టాలిన్ (4), కూతురు చుక్కీ (2) ఉన్నారు. స్టాలిన్‌ను ఇడుపులపాయలోని వసతి గృహంలో ఉంచి చదివించాలని సూసైడ్ నోట్‌లో అతను విజ్ఞప్తి చేశాడు. సిబిఐ జగన్‌ను వేధిస్తోందని, ఇదే తీరు కొనసాగితే మరికొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని నోట్‌లో అతను రాసినట్లు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు చెప్పినట్లు సాక్షి దినపత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+