Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే ఎస్‌ఎస్‌సి ఫలితాలు: మీ చేతి మీదనే....

Oneindia Telugu
హైదరాబాద్: సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్‌సి) పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలవుతున్నాయి. మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. అయితే ఫలితాల ప్రకటనలో ప్రభుత్వం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పరీక్ష ఫలితాలను వెల్లడించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కులను ఎక్కడా ప్రకటించరు. మెమోలో కూడా మార్కులకు బదులు గ్రేడులే ప్రకటిస్తారు.

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు.. ఈనెల 24వ తేదీన విడుదల చేయనున్న పదో తరగతి పరీక్షా ఫలితాల నుంచే ఈ 'సంపూర్ణ గ్రేడింగ్ పద్ధతి'ని అమలు చేస్తారు. ఫలితాల సీడీలో గానీ.. తర్వాత పాఠశాలలకు పంపే మెమోలో గానీ.. ఎక్కడా విద్యార్థుల మార్కులు తెలిసే అవకాశం లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యాసంస్థల మధ్య అనారోగ్యకర పోటీని నియంత్రించటంతో పాటు విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కూడా టెన్త్ ఫలితాల్లో 'తొమ్మిది పాయింట్ల స్కేల్'ను గ్రేడింగ్‌లో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా గ్రేడింగ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. కానీ, దీంతో పాటు మార్కులను కూడా విడుదల చేస్తున్నారు.

2009 అక్టోబర్ 23న మాథ్యమిక విద్యాశాఖ జారీచేసిన జీవోఆర్టీ నెం.592 ప్రకారం 2010లో గ్రేడింగ్ పద్ధతి అమల్లోకి వచ్చింది. అయితే గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా విద్యార్థులు తెలుసుకునేలా అప్పుడు ఏర్పాటు చేశారు. మార్కుల మెమోలపై మార్కులు, గ్రేడులు.. రెండింటినీ నమోదు చేస్తున్నారు. ఇలాగైతే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తడంతో , సంపూర్ణ గ్రేడింగ్ ఎలా ఉండాలో వివరిస్తూ 2011 మే 17న మాథ్యమిక విద్యాశాఖ మళ్లీ జీవోఆర్టీ నెం.419ని విడుదల చేసింది. అప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసినందున ఆ విషయం మరుగున పడిపోయింది.

దీంతో కొందరు ఈ విషయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సదరు జీవో ప్రకారం 'సంపూర్ణ గ్రేడింగ్ పద్ధతి'ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను కోర్టు ఆదేశించింది. దీంతో.. మాథ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి అధికారులతో ఈ అంశంపై గురువారం సమీక్షించారు. మాథ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పాఠశాల విద్యా కమిషనర్ ఎన్.శివశంకర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ బి.మన్మధరెడ్డి, సంబంధిత అధికారులు దీనిపై చర్చించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల ప్రకారం.. మార్కులు ఇవ్వకుండా మొత్తం గ్రేడులే ఇవ్వాలని నిర్ణయించారు.

నేడు ఎస్ఎస్‌సి ఫలితాలను వన్ ఇండియా తెలుగు అందిస్తోంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందించేందుకు మేం ఏర్పాట్లు చేశాం. సమాచారం వెంటనే మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చి పడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ క్లిక్ చేసి రిజిష్టర్ చేసుకోవడమే...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+