కులతత్వం వల్లే సిఎంగా కిరణ్ కుమార్ రెడ్డి: కెటిఆర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకునే స్థాయి ముఖ్యమంత్రికి లేదని ఆయన తప్పు పట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెసు నాయకులు మతిలేని, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పరకాల ప్రజలే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకృతి కూడా ఛీకొట్టిందని ఆయన అన్నారు.
మతతత్వం గురించి మాట్లాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు కోసం మజ్లీస్ పార్టీతో అంట కాగుతున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తిరుమల పర్యటనను కూడా ముఖ్యమంత్రి వక్రీకరించారని ఆయన అన్నారు. సోనియా అతి పెద్ద క్రిస్టియన్ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు అర్థమేమిటని ఆయన అడిగారు.
ఏడాది పాలన తర్వాత కూడా ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి నీతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సొంత జిల్లాలోని తిరుపతి సీటు అయినా గెలిపించుకోగలరా అని ఆయన ముఖ్యమంత్రిని సవాల్ చేశారు. కాంగ్రెసు ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
శాసనసభ్యులకు రూ. 25 లక్షలేసి, పార్చులర్ కార్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కేసుల పేరుతో మంత్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తద్వారా మంత్రులతో తనకు అనుకూలంగా మాట్లాడించుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications