విలాసాలకు మరిగాడు: వైయస్ జగన్‌పై పొన్నం

స్వార్థ ప్రయోజనాల కోసం మీడియాను జగన్ అడ్డుపెట్టుకోవడాన్ని సరి రాదని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న క్రమంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీలో విభేదాలు తేవడమేనని ఆయన అన్నారు. షోకాజ్ నోటీస్ ఉపసంహరణకు పీసీసీ, క్రమశిక్షణ సంఘానికి లేఖలు రాస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
తెలంగాణలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టే కారణమని, రాజకీయ డ్రామాలు మాని వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీని విద్యార్థి జేఏసీ నాయకులు నిలదీశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ నిజామాబాద్‌లో ఆదివారం ఉదయం రీబిల్డింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్నింగ్ వాక్‌లో పాల్గొనేందుకు వచ్చిన యాష్కీని విద్యార్థి జేఏసీ అడ్డుకుంది.
తెలంగాణ పేరు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని వారు ఆరోపించారు. సుమారు అర గంట పాటు ఎంపీని కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీంతో పార్లమెంటు సభ్యుడు యాష్కీ వారికి సర్దిచెప్పేందుకు యత్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నానని, గతంలోనూ త నను పార్టీ సస్పెండ్ చేసిందని, హైకమాండ్‌తో చర్చించి తెలంగాణ సాధనకు కృషి చేస్తానని అన్నారు.
జూలై తర్వాత తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని మధుయాష్కీగౌడ్ వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications