అప్పటి వరకు విచారణ ఆపండి: ఈసికి జగన్ పార్టీ విజ్ఞప్తి

ఈ మేరకు భన్వర్ లాల్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాగా ఈ నెల 25వ తేదిన తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ జగన్‌కు నోటీసులు పంపగా, 28న కోర్టుకు హాజరు కావాలని సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను కోర్టుకు హాజరు కావాలంటూ సిబిఐ ఆదేశాలు జారీ చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. 250 రోజులుగా జగన్‌పై చర్యలు తీసుకోని సిబిఐ.. ఇప్పుడే కళ్లు తెరిచిందా అని ప్రశ్నించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తమ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.
జగన్‌కు ప్రజాబలం ఉందని సిబిఐ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా ఆయనను ఏమీ చేయలేవన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నదని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధింస్తుందని జూపూడి అన్నారు.












Click it and Unblock the Notifications