అరెస్టు కుట్ర: వైయస్ వివేకా, సోనియాపై భారతి ఫైర్

జగన్ అరెస్టు వెనుక కుట్ర ఉందన్నారు. జగన్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. కాంగ్రెసుని అధికారంలోకి తీసుకొచ్చి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పాలించి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రశంసలు పొందిన వైయస్సార్ పైన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులు, ముఖ్యమంత్రులకు లేదా అని ప్రశ్నించారు. జగన్ ప్రమేయంతోనే వైయస్సార్ బల్లకింద దొంగ సంతకాలు చేశారని సిబిఐ విచారణకు తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు.
భౌతికంగా లేని వైయస్ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన కాంగ్రెసు ప్రభుత్వమే కోర్టులను, పరిశోధన విభాగాలను ప్రభావితం చేసిందన్నారు. ఇంత దారుణం ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జగన్ అరెస్టు నేపథ్యంలో సంయమనం పాటిస్తూ ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్నారు.
సిబిఐ ఏడెనిమిది నెలలుగా దర్యాప్తు చేస్తోందని, ఇప్పటిదాకా ఏమీ గుర్తించలేదని, వైయస్ ఈ ప్రపంచంలోనే గొప్ప నాయకుడని, అలాంటి వాళ్లను వేళ్లమీద లెక్కించవచ్చునని, తన భర్త జగన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా మాట వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లినందుకే ఇదంతా జరుగుతోందని జగన్ సతీమణి భారతి అన్నారు. ఇది స్వేచ్ఛాయుత దేశమని, భారతీయ పౌరులు ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లవచ్చునని, అలా కాకుండా... జిల్లా కేంద్రాల్లోనే బాధితులను కలవాలని, ఒకేచోట ఓదార్చాలని ఎవరూ ఆదేశించలేరన్నారు.
కాంగ్రెసుకు తన మామగారు 33 ఎంపీ సీట్లను గెలిపించి ఇచ్చినందుకు సోనియా మా కుటుంబానికి మంచి బహుమతి ఇచ్చారన్నారు. తన అన్న తప్పేమీ లేదని, ప్రధాని, సోనియా, సిబిఐ అధికారులు కుతంత్రం పన్ని తమను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ సోదరి షర్మిల అన్నారు.












Click it and Unblock the Notifications