వైయస్ జగన్ వర్మను బెదిరించాడు: లగడపాటి

లగడపాటి రాజగోపాల్ ప్రకటనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా తీవ్రంగా మండిపడ్డారు. లగడపాటి రాజగోపాల్‌వి పిచ్చి మాటలని ఆమె అన్నారు. ప్రచారం కోసం లగడపాటి రాజగోపాల్ ఆ విధమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. లగడపాటి రాజగోపాల్ మాటలను ప్రజలు నమ్మబోరని ఆమె అన్నారు.
మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు వర్మ చెప్పిన మాటలనే తాను చెప్పానని లగడపాటి అన్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఆ విషయం చెప్పలేదని ఓ టీవీ చానెల్ ప్రతినిధి అడిగితే - సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానని ఆయన అన్నారు. కావాలంటే వర్మనే అడగాలని ఆయన ఆ ప్రతినిధితో అన్నారు.
ఆరోపణలపై విచారణ పూర్తయితే వైయస్ జగన్ రాజకీయాలకు అనర్హుడు అవుతాడని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మాట తప్పని నేత అయితే జగన్ మూట విప్పని నేత అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రజా సంక్షేమం కోరే పార్టీ అయితే జగన్ మూట విప్పని నేత అని లగడపాటి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చార్జిషీట్లు తప్ప మ్యానిఫెస్టోలు లేవని ఆయన అన్నారు. తల్లి విజయమ్మ ప్రచారం చేసినా వైయస్సా కాంగ్రెసు పార్టీకి ఓట్లు రాలవని ఆయన అన్నారు.
కాగా, సానుభూతి వేరు, ఎన్నికలు వేరని మంత్రి సుదర్శన్ రెడ్డి గుంటూరు జిల్లాలో అన్నారు. 2014లో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తాను పది నియోజకవర్గాల్లో పర్యటించానని, పరిస్థితి తమ పార్టీకి ఆశాజనకంగా ఉందని పిసిసి మాజీ డి. శ్రీనివాస్ హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంత పెద్దయెత్తున, ఇంత చొరవతో ప్రచారం చేయడం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications