యుపిలో పట్టాలు తప్పిన డూన్: నలుగురు మృతి

డూన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. జౌన్పూర్ జంక్షన్ సమీపంలోని మిహ్రాన్ స్టేషన్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు మరణించినట్లు జౌన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించారు. ప్రమాదం సంభవించినప్పుడు రైలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాయి. వారణాసి, ఫైజాబాద్, లక్నోల నుంచి రిలీఫ్ రైళ్లను రప్పిస్తున్నారు. స్థానికులు, స్థానిక ఆస్పత్రులకు చెందిన వైద్యులు మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణం తెలియాల్సి ఉంది.
ఇదిలా పుంటే, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు. రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని లకహూటి వద్ద ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సు మినీ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమదాం సంభవించింది. గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications