వైయస్‌తో కిరణ్ ఎందుకు వెళ్లలేదు: జగన్ పార్టీ నేత

Gattu Ramachandar Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై కాంగ్రెసు నాయకుల తీరు అభ్యంతరకరంగా ఉందని వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు అన్నారు. వైయస్ మృతిపై తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యక్తం చేసిన అనుమానాలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇతర కాంగ్రెసు నేతలు చేస్తున్న విమర్శలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు.

హెలికాప్టర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు అప్పుడు శానససభ స్పీకర్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లాల్సి ఉండగా, ఎందుకు వెళ్లలేదని, వైయస్ హెలికాప్టర్ ప్రమాదం గురించి కిరణ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసా అని ఆయన అడిగారు. నీతి మాలిన రాజకీయాలను మానుకోవాలని ఆయన కాంగ్రెసు నాయకులకు హితవు పలికారు.

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కాంగ్రెసు నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ ఉన్నప్పుడు కాంగ్రెసు నాయకులు వానపాముల్లా వెంటే ఉండేవారని, కానీ ఇప్పుడు ఆ నాయకులే విషపు పాముల్లా తయారయ్యారని ఆయన అన్నారు. విజయమ్మకు రాష్ట్ర ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లోనూ తమ పార్టీయే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.

ప్రజల్లో వైయస్ విజయమ్మకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు శనివారం తిరుపతిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. వైయస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన 700 కుటుంబాలకు ఎఐసిసి ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మరిచిపోయారని ఆయన అన్నారు.

కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు శనివారం గుంటూరు జిల్లాలో విరుచుకుపడ్డారు. లగడపాటి చేయించే సర్వేలన్నీ తప్పుల తడకేనని ఆయన అన్నారు. వలసల కారణంగా అతి త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వానికి దమ్ముంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+