హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆట ఇప్పుడే మొదలైంది: రోజా, రామోజీ కలలు.. శోభా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: ఆట ఇప్పుడే మొదలైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత, ప్రముఖ నటి రోజా ఆదివారం అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో ఆట ముగిసిపోతుందని కొందరు భావించారని, కానీ తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజమయ్మ రంగంలోకి దిగడంతో ఇప్పుడే అసలు ఆట మొదలైందని, ఇది వారికి కూడా అర్థమైందని అన్నారు.

వైయస్ విజయమ్మ మహిళ అని కూడా చూడకుండా కాంగ్రెసు పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొందరు నేతలు ఆమెను ఏకవచనంతో పిలిచే నీచ స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు. విజయమ్మ రంగ ప్రవేశంతో అందరూ నోరు వెళ్ల బెట్టారన్నారు. విజయమ్మ, షర్మిలల సూటుకేసులు తెరిచి చూడటం ఆమెను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 70 లక్షళ ఓటర్లను మోసం చేశారని శోభా నాగి రెడ్డి విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెసుకు తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని రామోజీ రావు కలలు కంటున్నారని, కానీ అది ఎప్పటికీ జరగదన్నారు.

ఏ తప్పూ చేయలేదు కాబట్టే జగన్ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ఎదిరించగలిగారని జూపూడి ప్రభాకర రావు అన్నారు. జగన్‌ను నిర్బంధించినా ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారన్నారు. వైయస్ మృతిపై వివరాలు అడిగితే సిబిఐ జెడి మాట్లాడలేదన్నారు. వైయస్ మృతి కేసు మూడు నెలలో పూర్తి చేసిన సిబిఐ జగన్ కేసును మాత్రం తొమ్మిది నెలలుగా విచారిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కొండా సురేఖ గెలుపు ఖాయమన్నారు.

వైయస్ విజయమ్మ కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహించడం అమానుషమని అనంతపురంలో గుర్నాథ్ రెడ్డి అన్నారు. ప్రచారాన్ని అడ్డుకునేందుకే జగన్ అరెస్టు జరిగిందన్నారు. విజయమ్మపై కాంగ్రెసు నేతలు నోరుపారేసుకుంటే సహించేది లేదన్నారు. ఓ పార్టీ అధినేతను ప్రచారానికి దూరంగా ఉంచడం సరికాదని మరో పార్టీ నేత తోపుదుర్తి కవిత అభిప్రాయపడ్డారు. టిడిపి, కాంగ్రెసు కుట్ర కారణంగానే జగన్ అరెస్టు జరిగిందన్నారు. ఓటమి భయంతోనే వారు ఈ కుట్రకు తెరతీశారన్నారు.

English summary
YSR Congress Party leader Roja said, political game start after party respectory president and Pulivendula MLA YS Vijyamma bypolls campaign start. He said party will win in all seats with bumper majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X