సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు ఎస్కార్ట్, హెచ్చరికలతో!

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, గాలి జనార్ధన్ రెడ్డి ఒబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ కేసు తదతర కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయన రక్షణ కోసం పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని రంగంలోకి దించింది. జగన్ అరెస్టు దరిమిలా లక్ష్మీ నారాయణ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

లక్ష్మీ నారాయణకు గతంలోనే బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని, వ్యక్తిగత గన్‌మెన్‌ను కేటాయించినా, అప్పట్లో ఆయన గన్‌మెన్ భద్రతను తిరస్కరించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మీ నారాయణ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటి ఉండేలా ఆరుగురు సాయుధ పోలీసుల ఎస్కార్టును రాష్ట్ర పోలీసులు కేటాయించారు. లక్ష్మీ నారాయణ ఇంటి వద్ద పోలీసు పికెట్ పటిష్ఠం చేశారు.

కాగా గతంలో గన్‌మెన్‌లను తిరస్కరించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం ఆయనపై ఎస్కార్ పెంచుకోవాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. దీంతో ఆయనకు ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వైయస్ జగన్‌ను, ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. వీరితో పాటు పలువురు అధికారులను మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణలను కూడా అరెస్టు చేశారు.

కాగా భద్రత పెంచడంతో లక్ష్మీ నారాయణకు 12 మందితో కూడిన ఎస్కార్ట్ వాహనం ఇస్తుంది. 2+2 పోలీసులు నిరంతరం సిబిఐ జెడికి భద్రతగా ఉంటారు. సిబిఐ కార్యాలయం వద్ద జెడి ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. కాగా వైయస్ జగన్‌ను ఈ రోజు నుండి ఐదు రోజుల పాటు సిబిఐ తమ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+