ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడుక్కోసం విజయమ్మ కుట్ర: బొత్స, షర్మిలపై చిరు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Botsa Satyanarayana
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మండిపడ్డారు. వారిరువురు బుధవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భర్త వైయస్ రాజశేఖర రెడ్డి చావును వైయస్ విజయమ్మ రాజకీయం చేస్తున్నారని, కొడుకు వైయస్ జగన్ రాజకీయం కోసం కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే అవినీతికి గేట్లు తెరిచినట్లేనని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ కోట్లు కొల్లగొట్టారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణిస్తే తామంతా బాధపడ్డామని, భర్త మృతికి కుట్ర జరిగిందని వైయస్ విజయమ్మ ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్ విజయమ్మ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని చంపుకుంటే కాంగ్రెసుకు ఒనగూరే ప్రయోజనం ఏమిటని చిరంజీవి ప్రశ్నించారు. వైయస్ జగన్ పార్టీ పెట్టారని, పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చునని, అయితే వైయస్ జగన్ ఎజెండా, జెండా ముఖ్యమంత్రి పదవి మాత్రమేనని ఆయన అన్నారు. తండ్రి చనిపోతే కుమారుడికి అధికారం దక్కడానికి ఇది రాచరికం కాదని, ఇది ప్రజాస్వామ్యమని, ప్రజలు ఆదరిస్తేనే పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీకి చెందినవారు ఏం త్యాగాలు చేశారని ఆయన అడిగారు. వైయస్ జగన్ సోదరి షర్మిలపై చిరంజీవి మండిపడ్డారు. షర్మిల, అనిల్ లక్షల ఎకరాల గనులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారని, షర్మిలకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

రాజీవ్ గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం త్యాగాలు చేశాయని, ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ నాయకులకు త్యాగానికి అర్థం తెలియదని ఆయన అన్నారు. 2004లో 18 లక్షల ఆస్తి చూపించిన వైయస్ జగన్‌కు ఇప్పుడు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని, అదంతా దోచుకున్నదేనని ఆయన అన్నారు. అనిశ్చిత పరిస్థితికి వైయస్ జగన్ కారణమని ఆయన విమర్శించారు.

English summary
PCC president Botsa Satyanarayana and Congress Rajyasabha member Chiranjeevi have opposed YSR Congress honorary president YS Vijayamma's comments on YS Rajasekhar reddy's death. Botsa said that Vijayamma is politicizing the issue for his son YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X