జగన్ పిటిషన్: లగడపాటి, ఉండవల్లిలకు కౌంటర్

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్‌ల వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి ఆయుధంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియాతో తనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు భావిస్తున్నారు. తమకు మధ్యంతర బెయిల్ అవసరం లేదని జగన్ కోర్టులో మెమో దాఖలు చేశారని మొదట లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఆ మెమో ప్రతిని కూడా ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ముందుకు రావడానికి జగన్ సిద్ధంగా లేరని ఆయన అన్నారు.

అదే వ్యాఖ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం చేశారు. తనకు మధ్యంతర బెయిల్ అవసరం లేదని జగన్ కోర్టుకు తెలిపారని ఆయన అన్నారు. హడావిడిగా కాగితం రాసి మెమో దాఖలు చేయడం వెనక జగన్ ఉద్దేశం అదేనని ఆయన అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ వద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో మెమో దాఖలు చేశారని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం అన్నారు.

ఆయన సిఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన తల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, తన సోదరు షర్మిల ప్రచారానికి వస్తున్న ఆదరణ చూసి జైలులోనే ఉండటం నయమని జగన్ భావిస్తున్నారని అన్నారు.అందుకే తనకు బెయిల్ వద్దని జగన్ కోర్టులో మెమో దాఖలు చేశారన్నారు.

ఉప ఎన్నికల సందర్భంగా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అండర్ ట్రయల్‌గా ఉన్న తనకు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో కోరారు.

జైళ్ళ శాఖ డిజి, ఐజి, డిఐజిలను జగన్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గత నెల 27న తేదిన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 28వ తేదిన అతనిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+