వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రణరంగంగా పెట్రోకోక్ అభిప్రాయ సేకరణ, జీపులుధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Visakapatnam
విశాఖపట్నం: జిల్లాలోని రాంబిల్లి మండలం సీతంపాలెం, చాట్లమెట్ల గ్రామాలలో పెట్రో కోక్ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. పెట్రో కోక్ పైన అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో పెట్రో కోక్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు నచ్చజెప్పడానికి యత్నించినా స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో భారీగా పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకున్నా గ్రామస్తులు తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. గ్రామస్తులు కర్రలు, మారణాయుధాలతో దాడికి దిగారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. గ్రామస్తులు రెండు పోలీసులు జీపులను ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీఛార్జీలో పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రెండు మూడు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు.

కాగా రాంబిల్లి మండలంలోని పెట్రో కోక్ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు స్పందించారు. అధికారులు పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తల కోసం ప్రజల జీవితాలను బలిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినా విధానాలు మారటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలు వద్దంటుంటే పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారన్నారు. విశాఖ పట్ల కాంగ్రెసుకు ఎంత చులకన భావముందో అర్థమవుతోందన్నారు. అవినీతి అధికారులు ఎందరో జైళ్లలో మగ్గుతున్నప్పటికీ మిగతా వారికి మాత్రం బుద్ధి రావడం లేదన్నారు. కాగా పెట్రో కోక్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను 33 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

English summary
Petroleum Coke plant public opinion created very tension in Vishakapatnam. Villagers obstructed officers, who were came to take people opinion. Few people injured in police lathi charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X