సాయిరెడ్డి తిరుపతి యాత్రకు సిబిఐ అభ్యంతరం

ఈ నెల 13వ తేదీ తర్వాత విజయసాయి రెడ్డి యాత్రకు అనుమతిస్తే అభ్యంతరం లేదని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 13వ తేదీ తర్వాత షెడ్యూల్ ఇస్తే అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు విజయసాయి రెడ్డికి తెలిపింది. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 21వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండు, మూడు చార్జిషీట్లను, ఎమ్మార్ కుంభకోణం కేసులో అనుబంధ చార్జిషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి ఇవ్వడానికి సిబిఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. చార్జిషీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సిబిఐ చెప్పడంతో కోర్టు ఆ అనుమతి ఇచ్చింది. జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఒఎంసి కేసుల్లో నిందితులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో సిబిఐ అధికారులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు జగన్ సిబిఐ కస్టడీ ముగుస్తుంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను, ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్‌ను సిబిఐ విచారణకు పిలిచింది. వారిద్దరిని ఎస్పీ వెంకటేష్ ప్రశ్నిస్తుండగా, జగన్‌ను సిబిఐ జెడి లక్ష్మినారాయణ ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications