సిఎం అఖిలేష్ భార్య డింపుల్ గెలుపునకు లైన్ క్లియర్

అంతేకాదు ఉప ఎన్నికలలో డింపుల్ యాదవ్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకుంది. విపక్ష బహుజన సమాజ్ పార్టీ కూడా ఉప ఎన్నికలలో పోటీకి విముఖత చూపింది. ఈ స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని నిలపరాదని నిర్ణయించినట్లు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాంగ్రెసు, బిఎస్పీ పోటీకి విముఖత చూపినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం పోటీకి ఆసక్తి చూపింది.
ఈ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని బిజెపి నిర్ణయించినప్పటికీ అది కుదరలేదు. బిజెపి అభ్యర్థి జగ్దేవ్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లేసరికి సమయం దాటిపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఈ స్థానంలో డింపుల్ యాదవ్‌తోపాటు సంయుక్త సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అభ్యర్థి మాత్రమే పోటీలో మిగిలారు. కాగా, కనౌజ్ స్థానంలో డింపుల్‌ను దింపడం ద్వారా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తన బంధుప్రీతిని కొనసాగించిందని బిఎస్పీ ఆరోపించింది.
ఎస్పీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో చట్టం పనిచేయని వాతావరణం కనిపిస్తోందని, పలు సంక్షేమ పథకాలు మూలనపడ్డాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. మూడు నెలల పాలనలోనే ప్రజలు హింసతో బాధపడుతుంటే.. ఎస్పీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ మాత్రం తన కొడుకుకు ఆరు నెలల సమయం ఇవ్వమని ప్రజలను, ప్రతిపక్షాలను అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోవడంతో డింపుల్ అఖండ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రతిపక్ష బిఎస్పీ, బిజెపి పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన పక్షంలో పోరు కాస్త రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications