ప్రేమ వివాహం: కూతుళ్లను వేధిస్తున్న వీరప్పన్ భార్య

గత నెల 5న విధులకు వెళ్లిన విద్యా రాణి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను ఎవరో అపహరించుకెళ్లారనే వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. సోమవారం సాయంత్రం విద్యా రాణి తన భర్త దీపక్, చెల్లెలు విజయలక్ష్మి, ఆమె భర్త షణ్ముగ రాజ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ ప్రేమ వివాహం తల్లికి ఇష్టం లేకపోవడంతో ఆమె తన మనుషులతో తమను ఎన్నోరకాలుగా వేధించినట్టు తెలిపారు.
వేధింపుల్లో భాగంగా ఆమె తన సర్టిఫికెట్లను కూడా తీసుకెళ్లిపోవడంతో.. వాటి కోసం తల్లితో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు చెప్పారు.ఒంటరిగా వస్తే సర్టిఫికెట్లు ఇస్తానని తల్లి చెప్పడంతో.. ఆ మాటలు నమ్మి గత నెల 5న మేచేరి సమీపంలోని పొట్టనేరి గ్రామంలో ఉంటున్న తల్లి ముత్తులక్ష్మి ఇంటికి వెళ్లానని, అప్పుడు కూడా.. తన తల్లి భర్తను వదిలి తనతో ఉంటే సర్టిఫికెట్లు ఇస్తానని షరతు విధించడంతో, ఆమెను నమ్మించినట్లు నటించి సర్టిఫికెట్లు ఉన్న చోటు తెలుసుకుని వాటిని తీసుకొని తన ఇంటికి చేరుకున్నానని వివరించారు.
తన చెల్లెలు విజయ లక్ష్మిది కూడా ప్రేమ వివాహమేనని, దీంతో తల్లి ముత్తు లక్ష్మి మనుషులు విజయ లక్ష్మిని, ఆమె భర్త షణ్ముగ రాజ్‌ను తీసుకెళ్లి కర్ణాటక రాష్ట్రం నల్లూరు సమీపంలో అడవిలో ఉంచి చిత్ర వధ చేశారన్నారు. ఆమె కూడా ఆ నరకం నుంచి తప్పించుకుని భర్త ఇంటికి చేరుకుందని, ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భవతి అని తెలిపారు. తమకు, తమ భర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే తమ తల్లే బాధ్యత వహించవలసి వస్తుందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని విద్యా రాణి వివరించారు.












Click it and Unblock the Notifications