సిబిఐ ఆఫీసుకు వైయస్ జగన్ తరలింపు, విచారణ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు శనివారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన చంచల్‌గుడా జైలు నుంచి కోఠీలోని తమ కార్యాలయానికి తరలించారు. ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. మరోసారి రెండు రోజులు ఆయనను వారు ప్రశ్నిస్తారు.

అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు శని, ఆదివారాలు ప్రశ్నిస్తారు. వైయస్ జగన్‌ను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, రెండు రోజుల పాటు వైయస్ జగన్‌ను సిబిఐ కోర్టు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నిస్తారు.

చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా వున్న జగన్‌ను ఆయన సతీమణి భారతి శుక్రవారం కలిసారు. వైయస్ జగన్‌ను సిబిఐ 27వ తేదీ సాయంత్రం అరెస్టు చేసి, 28వ తేదీన చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆ తర్వాత జగన్‌ను భారతి మే 29, 30, 31 తేదీల్లో జైలులో ములాఖత్‌లో కలిసారు. ఆ మరునాడు జూన్ 1న ఆమె జగన్‌ను కలవడానికి రాగా నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు తిరస్కరించారు.

నాలుగురోజులు జగన్‌ను కోఠి సిబిఐ కార్యాలయంలో విచారించినపుడు జగన్‌ను కలవడానికి సిబిఐ అధికారులు ఎవరికీ అనుమతివ్వలేదు. శుక్రవారం ఉదయం భారతి జగన్‌ను కలిసి సుమారు నలభై నిమిషాలు మాట్లాడి వచ్చారు. అలాగే జైలులో సాధారణ ఖైదీలుగా వున్న కోనేరు ప్రసాద్‌ను ఆయన సన్నిహితుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ శుక్రవారం ములాఖత్‌లో కలిశారు. విచారణ ఖైదీగా వున్న ఐఎఎస్ అధికారి బి.పి.ఆచార్యను ఆయన భార్య బి.పి.రంజన్ టక్కర్ ఆచార్య కలిసి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+