వైయస్ జగన్ పోస్టు కార్డును వాడుకుంటారా?

YS Jagan
హైదరాబాద్: ఆధునిక సమాచార వినిమయ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు రాయడమనేది దాదాపుగా మరిచిపోయినట్లే అయింది. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ఆధునిక మీడియా అందుబాటులో లేదు. మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది.

ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లకు విజ్ఞప్తి చేయడానికి ఆధునిక సౌకర్యాలు ఆయనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నెల 12వ తేదీన 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ఆయన పోస్టు కార్డులను వినియోగించుకునే వీలుంది.

జైలు మాన్యువల్ ప్రకారం - ఖైదీ పక్షం రోజుల్లో ప్రభుత్వం ఖర్చుతో ఓ పోస్టు కార్డు వాడుకోవచ్చు. అండర్ టర్యల్ ఖైదీ ఆ పోస్టు కార్డును తన కుటుంబ సభ్యులకు, బంధువులకు లేదా మిత్రులకు ఉత్తరం రాయడానికి పోస్టు కార్డును వాడుకోవచ్చు. అయితే, పోస్టు కార్డులోని విషయాన్ని జైలు అధికారులు సెన్సార్ చేస్తారు. అభ్యంతరకరమైన విషయాలు లేకుండా చూస్తారు.

ఈ స్థితిలో వైయస్ జగన్ పోస్టు కార్డును వాడుకుని ఓటర్లకు ఏదో రూపంలో విజ్ఞప్తి చేసుకునే అవకాశాలున్నాయి. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాయవచ్చుననే ఐడియా వస్తుందా, ఆయనకు ఈ ఐడియాను ఎవరైనా అందజేస్తారా అనేది చూడాల్సిన విషయం. పోస్టు కార్డు ధర యాభై పైసలు మాత్రమే. దాని ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+