వ్యూహం మార్చి వైయస్ జగన్‌ను ప్రశ్నించిన సిబిఐ

వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని పలువురికి సిబిఐ అధికారులు చెప్పారు. అయితే, వారెవరినీ సిబిఐ పిలువలేదు. వ్యూహం మార్చి సిబిఐ అధికారులు జగన్‌ను ఏకాంతంగా ఒక్కడినే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విదేశీ లావాదేవీలకు సంబంధించి వైయస్ జగన్ నుంచి కొంత మేరకు శనివారం సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఏసియన్ ఇన్‌ఫ్రా అసలు యజమానులపై సిబిఐ అధికారులు జగన్‌ను ఆరా తీసినట్లు సమాచారం. నగల వ్యాపారి సుఖేష్ గుప్తాతో ఆర్థిక లావాదేవీలపై కూడా సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రోజు, రేపు విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు విజయసాయి రెడ్డిని అదేశించింది. సింఘానియా అనే వ్యక్తిని సిబిఐ గతంలో ఓసారి విచారించింది. అందుబాటులో ఉండాలని సిబిఐ ఆయనను ఆదేశించినట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు శనివారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన చంచల్‌గుడా జైలు నుంచి కోఠీలోని తమ కార్యాలయానికి ఉదయం తరలించారు. ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. రేపు ఆదివారం కూడా సిబిఐ అధికారులు జగన్‌ను ప్రశ్నిస్తారు.
వైయస్ జగన్‌ను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, రెండు రోజుల పాటు వైయస్ జగన్‌ను సిబిఐ కోర్టు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో మొదటి రోజు విచారణ శనివారం సాయంత్రం ముగిసింది.












Click it and Unblock the Notifications