అనంతపురం హోరాహోరీ: లెక్కలు కుదిరి గట్టెక్కేదెవరు?

నియోజకవర్గంలో మైనారిటీల ఓటు బ్యాంకు నిర్ణయాత్మకం కావడంతో ఆ వర్గానికి చెందిన ముర్షీదా బేగంను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. నియోజకవర్గాల పునర్విభజనతో అనంతపురం నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏర్పడింది. 19.99 శాతం ఉన్న ముస్లిం ఓటర్లల ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మైనార్టీ వర్గాలతో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మద్దతు తమకే ఉందనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నాయి.
ఆ తరువాత రెండో స్థానంలో బలిజ సామాజకవర్గం ఉంది. సుమారు 24వేల ఓట్లు ఈ వర్గానివే. టిడిపికి చెందిన మహాలక్ష్మీ శ్రీనివాస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. రెడ్డి సామాజిక వర్గానికి సుమారు 18వేల ఓట్లు ఉన్నా యి. అయితే, రెడ్డి ఓట్లలో చీలిక తేవడం ద్వారా జగన్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే.. ఆర్థిక బలసంపన్నుడైన గుర్నాథ్ రెడ్డిని ఢీ కొనడం ఖర్చులకు తడుముకుంటున్న టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులకు సవాలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వైయస్సార్ పోట్లాట వల్ల ఓట్లు చీలితే లాభపడాలని టిడిపి చూస్తోంది.
మైనారిటీ మహిళ ముర్షీదా బేగంను రంగంలోకి దించడం కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. నిజానికి అనంతపురం నియోజకవర్గంలో తొలి నుంచీ కాంగ్రెస్‌దే హవా. పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా, తొమ్మిదిసార్లు ఆ పార్టీవిజయదుందుభి మోగించింది. కాగా, సిపిఎం అభ్యర్థి ప్రధాన పార్టీలకు కొరకరాని కొయ్యలా మారారు. లోక్‌సత్తా మద్దతుతో సిపిఎం అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఆయనకు స్థానికంగా మంచి పరిచయాలు ఉండడంతో ఎవరి ఓటు ఎక్కువగా చీల్చుతారోనన్న గుబులు ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది.












Click it and Unblock the Notifications