అంటున్న వారే నన్ను మెచ్చుకున్నారు: భన్వర్ లాల్

స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మంగళవారం నాటి ఉప ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 140 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పారు. పోలింగ్ సరళిపై ప్రతిక్షణం నిఘాలో భాగంగా వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా రాజకీయ పార్టీలు, నేతలు సహకరించాలన్నారు.
జగన్ మీడియాపై ఫిర్యాదులు రాష్ట్ర స్థాయి అప్పిలేట్ అధికారికి అందలేదన్నారు. ఆదివారం రాత్రి నుంచి పోలీసుబలగాలు గస్తీ నిర్వహిస్తాయని, ఈ నెల 12 అర్ధరాత్రి వరకు గస్తీ కొనసాగుతుందని చెప్పారు. పోలింగ్, పోలీసు సిబ్బంది మొత్తం 50వేల మంది పాల్గొంటారన్నారు. పోలింగుకు 48 గంటల ముందు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తే ఫిర్యాదులు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పోలింగుకు ముందు ఓటర్లు ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి 48 గంటల గడువు విధించినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం తరఫున నాలుగు మొబైల్ నెంబర్లు ప్రకటిస్తామని, ఎవరైనా ఆ నెంబర్లకు ఎస్సెమ్మెస్ చరూపంలో ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వరకు ఇతర రాష్ట్రాల సరిహద్దులలో మద్యం దుకాణాలు బంద్ చేయాలన్నారు. తనను ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఒకప్పుడు మెచ్చుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications