కష్టంగానే ఉంది!: బైపోల్స్‌పై కిరణ్, వాయలార్ సమీక్ష

నర్సన్నపేటలో ఆది నుంచీ ముందంజలోనే ఉన్నా.. ఈ మధ్యకాలంలో వచ్చిన పరిణామాలు కొంత ఇబ్బంది కలిగించాయనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కూతురు షర్మిలల ప్రచారం, సెంటిమెంటు ఉన్నా.. ఎన్నికలను టైట్ ఫైట్‌కు తీసుకొచ్చామన్న అభిప్రాయం సమావేశంలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
అంతకుముందు వాయలార్ రవి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎక్కడా చర్చ జరగలేదని చెప్పారు. స్థానిక అంశాలకే ఉప ఎన్నికలు పరిమితం అన్నారు. ఉప ఎన్నికల తర్వాత పార్టీ తీరును సమీక్షిస్తామని చెప్పారు. తాను రెండుమూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలవలేదన్నారు. ఎన్నికల ఫలితాలు పార్టీ, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై తాను స్పందించనని చెప్పారు. వైయస్ జగన్ వ్యవహారం కోర్టు, సిబిఐ చూసుకుంటుందని చెప్పారు. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉప ఎన్నికల్లో అంచనా మేరకు సాధిస్తామన్నారు. ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం రెండు పార్టీలు తమకు ప్రత్యర్థులే అన్నారు. ఆయన అన్నా హజారే టీం పైనా విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications