జెడికి నార్కో టెస్టులు: జగన్ పార్టీ, రాందేవ్‌కు సూచన

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓ సాధారణ ఖైదీలాగా వ్యాన్‌లో తీసుకు వెళ్లడంతో జరుగుతున్న కుట్ర అర్థమవుతోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి మరిచి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందటం ఖాయమన్నారు. అందరూ అఖండ మెజార్టీతో గెలుస్తారని అన్నారు.
జగన్‌కు నార్కో పరీక్షలు చేయాలన్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకే ఆ పరీక్షలు చేయాలని మరో నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. జెడికి నార్కో పరీక్షలు చేస్తే జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న కుట్రదారులు ఎవరో తెలుస్తుందన్నారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ లేఖపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్‌ను వ్యాన్‌లో తీసుకు వెళ్లడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
చూస్తోంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉన్నట్టే దీని వెనుక కూడా కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. యోగా గురువు రాందేవ్ బాబా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అవినీతిపై పోరాటం కోసం మద్దతు కోరటం బాధాకరమన్నారు. బాబును బాబా మద్దతు కోరడమంటే ఓ మేకపిల్ల పులిని మద్దతు కోరుతున్నట్లే అన్నారు.
బాబా చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిదన్నారు. ఆయన గురించిన నిజాలు తెలుసుకోవాలని కోరారు. తన ఆస్తులపై కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు రాందేవ్ బాబాతో భేటీ అయి నీతివ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications