ప్రచారంలో జగన్ పార్టీ అభ్యర్థికి చుక్కెదురు, నోటుకు నో

ekapati Chandrasekhar Reddy
విశాఖపట్నం/నెల్లూరు: డబ్బులు పంచేందుకు వచ్చిన ఓ పార్టీ నేతలను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజవర్గంలో చోటు చేసుకుంది. నియోజకవర్గం పరిధిలోని సీతారాంపురంలో ఏడువందలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలో డబ్బులు పంచేందుకు వచ్చారట. వారు రాగానే మాజీ ఎంపిటిసి సభ్యుడి ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి నిలువరించి వెనక్కి పంపారు.

ఓట్ల కోసం తమ గ్రామంలో డబ్బు పంపిణీ చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచి, నిజాయితీకి పట్టం కట్టాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఓటుకు సొమ్ములు తీసుకునే సంస్కృతిని తమ పిల్లలకు అంటించబోమని చెప్పారు. డబ్బు పంపిణీ చేసే పార్టీలకు వ్యతిరేకంగా ఓటేస్తామన్నారు. అనంతరం తాము డబ్బు తీసుకోమంటూ గ్రామస్థులు ప్రమాణం చేశారు.

మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తాజా మాజీ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డికి ఓ గ్రామ ప్రజల నుండి చుక్కెదురయింది. కలిగిరి మండలం జిర్రావారిపాళెంలో గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ గ్రామం గుర్తుకొచ్చిందా అని, ఎన్నికలు వస్తేనే గుర్తుకు వస్తామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే మా గ్రామానికి వస్తారు కానీ.. మా సమస్యలు పట్టవా అని నిలదీశారు.

తొమ్మిది నెలలపాటు రేషన్ షాపు లేక ఇబ్బందులు పడ్డామని, ఇన్నాళ్లూ తాము కనిపించలేదా అని గ్రామంలోని రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని, మిమ్మల్ని గెలిపిస్తే గ్రామంలో ఒక్క సమస్యనైనా తీర్చరా అని ప్రశ్నించారు. తాను గెలిచినప్పటి నుంచి ఈ గ్రామానికి రాలేదని, ఇకనైనా దృష్టి పెట్టి గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని వారికి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తనను, తన సోదరుడిని గెలిపించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+