'గాలి' వర్గానికి షాక్:ఎంపి శాంత ఎన్నిక రద్దు, రీకౌంటింగ్

ఆమె ఎన్నిక చెల్లదని ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ నేత చంద్ర గౌడ హైకోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు కులధృవీకరణ పత్రం ఇచ్చారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. ఓటింగుకు రెండు రోజుల ముందు ఆమె అక్రమాలకు పాల్పడ్డారని శాంతాపై ఆరోపణలు చేశారు.
ఓటింగ్ సమయంలో కూడా చివరి రెండుమూడు రౌండ్లలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. దీనిపై విచారించిన కర్నాటక హైకోర్టు ఆరోపణలు సక్రమమేనని భావించి శాంత ఎన్నిక చెల్లదని ప్రకటించింది. నాలుగు వారాలలోగా తిరిగి ఓట్ల లెక్కింపు జరిపించాలని కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. శాంత ఎన్నికల చెల్లదనే కోర్టు తీర్పు గాలి శిబిరానికి దెబ్బే అని చెప్పవచ్చు.
కాగా గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బెయిల్ ఫర్ సేల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిబిఐ కోర్టును కోరింది. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీషీటర్ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications