ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం, కోట్ల రూపాయల్లో నష్టం

హైదరాబాదులోని కూకట్‌పల్లి(మూసాపేట్ చౌరస్తా)లో గత పదిహేను రోజులుగా ఎగ్జిబిషన్ నడుస్తోంది. బుధవారం ఉదయం హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఉదయం మున్సిపల్ సిబ్బంది చెత్త తగులబెడుతుంటగా మంటలు వ్యాపించి ఎగ్జిబిషన్‌ను తాకాయి. ఈ ఘటనలో సుమారు 90 స్టాళ్లు, పక్కనే ఉన్న మూడు లారీలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి.
నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. పదకొండు గంటల సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఫైర్ రీజీనల్ ఆఫీసర్ జివి నారాయణ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హుటాహుటిన మంటలను ఆర్పి వేయించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు అగ్ని ప్రమాదాల నివారణకు సరైన ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఎగ్జిబిషన్‌లో ఉన్న రెండువందల మంది కార్మికులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. కాగా ఎగ్జిబిషన్ వద్ద ఎలాంటి ఫైరింజన్లు గానీ, ప్రమాద నివారణ ప్రమాణాలు లేవని అంటున్నారు. కాగా అగ్ని ప్రమాదం కారణంగా మూసాపేట్ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications