శ్రీకాకుళంలో నాటుబాంబుల దాడి: నలుగురు మృతి

రెండు వర్గాలకు చెందిన మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 16 మందిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. రెండు వర్గాలకు మధ్య భూతగాదాలు గత కొద్ది రోజులుగా నడుస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు పికెట్ ఉంది. మంగళవారం ఉపఎన్నికల సందర్భంగా పోలీసులు నరసన్నపేట బందోబస్తుకు వెళ్లారు.
వంగర పోలీసు స్టేషన్‌లో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఒక వర్గం పథకం ప్రకారం నాటుబాంబులతో దాడి చేసి అనంతరం బళ్లాలు, గండ్ర గొడ్డళ్లు, కత్తులతో విరుచుకు పడిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటనపై మంత్రి కొండ్రు మురళీ మోహన్ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు.
శ్రీకాఖులం జిల్లా లక్ష్మీపేటలో మంగళవారం నాటుబాంబుల దాడిలో నలుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, గాయపడిన వారికి రూ.25వేలు పరిహారంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications