ఉప పోరులో జగన్‌దే విజయం: వన్ ఇండియా సర్వే

అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినప్పటికీ, ఆ ఆరోపణలతో జైలు పాలైనప్పటికీ వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల మద్దతును పొందడంలో విజయం సాధించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ పోర్టలో వన్ ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా వైయస్ జగన్ విజేతగా నిలిచారు.
అవినీతి ఆరోపణలు ఫలితాలపై వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయని కేవలం 12.5 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. పోలింగ్‌కు ముందు జగన్ అరెస్టు కావడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లాభించిందని 41.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫలితాల ప్రభావం అనంతర రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
వన్ ఇండియా తెలుగు నిర్వహించిన సర్వేలో కూడా వైయస్ జగన్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్ అరెస్టు తర్వాత కూడా వైయస్ జగన్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని 65.8 శాతం మంది అభిప్రాయపడగా, తెలుగుదేశం పార్టీకి 26.5 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. కాంగ్రెసు పార్టీకి 7.7 శాతం మంది మాత్రమే ఓటేశారు.
కాగా, నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం ఖాయమైనట్లు భావించవచ్చు. నెల రోజుల్లో ఎలా గెలుస్తామని కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు ఓడిపోతుందనే విషయం తేలిపోయినట్లే.












Click it and Unblock the Notifications