నార్కో పరీక్షలపై వైయస్ జగన్, విజయ సాయి కౌంటర్

YS Jagan - Vijaya Sai Reddy
హైదరాబాద్: సిబిఐ నార్కో పరీక్షల పిటిషన్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్‌తో పాటు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్, విజయ సాయి రెడ్డిలకు నార్కో పరీక్షలు జరిపేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారు కౌంటర్ దాఖలు చేశారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నార్కో టెస్టులకు అనుమతించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ తమ విచారణలో పెదవి విప్పడం లేదని, పూర్తి వివరాలు తెలియజేయడం లేదని కాబట్టి నార్కో టెస్టులకు అనుమతిస్తే నిజాలు నిగ్గు తేలుస్తామని కోర్టును సిబిఐ కోరింది.

నార్కో టెస్టులకు అనుమతిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నార్కో టెస్టులు సైంటిఫిక్‌గా రుజువు కాలేదని చెప్పారు. నార్కో టెస్టులకు అనుమతి కోరడం ద్వారా సిబిఐ సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు అన్నారు. కోర్టు ఇరువురి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను 14వ తేదికి వాయిదా వేసింది.

తాము ఏడు రోజుల కస్టడీలో జగన్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. సైంటిఫిక్ పద్ధతులలో ఎలాంటి హానీ జరగదని, విజయసాయి రెడ్డితో కలిసి జగన్ కుట్ర పన్నారని తెలిపారు. విచారణ సమయంలో జగన్ తెలివిగా సమాధానం చెప్పారన్నారు. ఆయన సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. హవాలా రూపంలో జగన్ కంపెనీలలోకి డబ్బు తరలిందని, దీనిపై ఆరు దేశాలకు ఫిబ్రవరిలో రెగోరేటరీ లేఖలు రాసినట్లు తెలిపారు.

పూర్తిస్థాయిలో ఆధారాల కోసం సైంటిఫిక్ విచారణకు అనుమతివ్వాలని కోరారు. నార్కో, బ్రెయిన్, పాలిగ్రాప్ టెస్టులకు అనుమతివ్వాలన్నారు. సిబిఐ పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను 14వ తేదికి వాయిదా వేసింది. దీంతో జగన్, విజయ సాయిలు ఈ రోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను 19వ తేదికి వాయిదా వేసింది.

మరోవైపు ఎమ్మార్ కుంభకోణం కేసులో తనపై నమోదైన కేసును ఎత్తి వేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణనను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు అనుమతించాలన్న ఈడి పిటిషన్ పైన కూడా వాదనలు పూర్తయ్యాయి. పిటిషన్‌పై తీర్పును కోర్టు 19వ తేదికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+