హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో జగన్‌ను కలిసిన వైయస్సార్సిపి విజేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు శనివారంనాడు హైదరాబాదులోని చంచల్‌గుడా జైల్లో కలిశారు. శాసనసభకు గెలిచిన అభ్యర్థులతో పాటు నెల్లూరు లోకసభ స్థానం నుంచి గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్‌ను కలిశారు. జగన్‌ను కలిసిన తర్వాత వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ వంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు తాము ఉప్పొంగిపోతున్నట్లు వారు తెలిపారు.

నిరంతరం తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వారు చె్పపారు. సానుభూతితో తాము గెలిచామని అన్నా తమకు పోయేదేమీ లేదని, ఈ గెలుపును తాము స్వీకరిస్తున్నామని, గర్వపడుతున్నామని వారన్నారు. వైయస్ జగన్ సూచనలు పాటించి తాము కలిసికట్టుగా పనిచేస్తామని వారు చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదం పట్ల జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, మృతుల కుటుంబాలకు జగన్ సానుభూతి ప్రకటించారని వారు చెప్పారు.

అంతకు ముందు వారు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిశారు. తమ విజయాన్ని వైయస్ జగన్‌కు అంకితం చేస్తున్నట్లు వారు తెలిపారు. పార్టీ కార్యాలయంలోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలంతా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని వారన్నారు. ఆ కల సాకారం చేయడమే తమ లక్ష్యమని వారు చెప్పారు.

ఉప ఎన్నికల్లో గెలుపు ప్రజా విజయమని రాయచోటి నుంచి గెలిచిన వైయస్సార్ కాగ్రెసు పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకు తనకు లభించిన 56 వేలకు పైగా మెజారిటీయే నిదర్శనమని ఆయన అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసినా ప్రజలను సిసలైన నాయకత్వాన్ని బలపరిచారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. పది మంది తెలుగుదేశం శాసనసభ్యులు, 40 మంది కాంగ్రెసు శానససభ్యులు తమతో టచ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసును నమ్ముకుంటే భవిష్యత్తు ఉండదని శానససభ్యులు అనుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leaders won in assembly bypolls met their party president YS Jagan in Chanvhalguda jail today. Earlier they met party honorary president YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X