వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో భారత టాక్సీ డ్రైవర్‌పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు మళ్లీ ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓ భారత టాక్సీ డ్రైవర్‌పై తాజాగా ఆస్ట్రేలియాలో దాడి జరిగింది. అతని కారును పూర్తిగా ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను జాతి వివక్షపరమైన వ్యాఖ్యలతో దూషించారు. కొంత మంది యువకులు బేస్‌బాల్ బ్యాట్‌లో తిరుగుతూ మెల్బోర్న్ శివారులో టాక్సీ డ్రైవర్లను దోచుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

మెల్బోర్న్ పశ్చిమ శివారులో వేర్వేరు సంఘటనలో ఓ ముఠా ఐదు టాక్సీలపై దాడి చేసి దోపిడీకి పాల్పడింది. బేస్‌బాల్ బ్యాట్లతో యువకులు రెండు కార్లను దొంగిలించి వాటి సాయంతో టాక్సీ డ్రైవర్లపై గత రాత్రి దాడి చేసారు. హర్‌ప్రీత్ సింగ్ సన్‌షైన్ శివారులో కారు నడుపుతుండగా ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది, వెంటనే మరో కారు ముందుకు వచ్చి ఆగింది. బేస్‌బాల్ బ్యాట్లతో నలుగురు యువకులు కారులోంచి దిగి డ్రైవర్ వైపు ఉన్న విండోను ధ్వంసం చేసినట్లు హరీప్రీత్ సింగ్ చెప్పారు.

చాలా భయానకంగా ఉందని, కారును ధ్వంసం చేస్తూ తనను కొడుతూ భీతావహ స్థితిని కల్పించారని అతను చెప్పారు. బేస్‌బ్యాట్ బాల్ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎడమ వైపు తాను ఒరిగానని, ఆ సమయంలో ఓ వ్యక్తి తన ముఖంపై పిడిగుద్దులకు పూనుకున్నాడని ఆయన వివరించారు.

తనతో ఏమీ మాట్లాడలేదని, కారును ధ్వంసం చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఆయన చెప్పారు. హర్‌ప్రీత్ సింగ్ చెప్పిన విషయాలను హెరాల్డ్ సన్ ప్రచురించింది. తన వద్ద 150 అమెరికా డాలర్లను, మొబైల్ ఫోన్‌ను తీసుకుని రెండు కార్లలో వారు పారిపోయారని ఆయన చెప్పారు. నెత్తురోడుతున్న పెదవులతో, విరిగిన చేయితో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

English summary
An Indian taxi driver was attacked and racially abused and his car smashed, as a group of baseball bat wielding youth went about attacking and robbing cab drivers in Melbourne suburbs. The gang ambushed and robbed five taxis in separate incidents in the western suburbs of Melbourne.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X