జగన్‌ను కల్సిన పిజెఆర్ తనయ: మంత్రి కొడుకు పరుగు

జగన్‌ను కలిసేందుకు వచ్చిన విశ్వరూప్ తనయుడు మీడియాను చూసి పరుగు లంఘించుకున్నారని టివి చానెల్‌లో ప్రసారమయింది. ఆయన మీడియా నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశాయని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన కృష్ణ తాను మాజీ మంత్రి మోపిదేవిని కలిసేందుకు వచ్చానని, జగన్‌ను కలిసేందుకు రాలేదని చెప్పారు. మరోవైపు విజయా రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి పిజెఆర్ మరణం తర్వాత దివంగత వైయస్ తమను బాగా ప్రోత్సహించే వారన్నారు. తనను రాజకీయాలలోకి రమ్మంటే సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పానని తెలిపారు.
జగన్ సతీమణి భారతి రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జైలులో జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి అసహనం ప్రదర్శించడం లేదని చెప్పారు. జగన్ త్వరలో జైలు నుండి బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.
జగన్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కుట్రలో భాగంగానే ఆయన జైలుకు వెళ్లారని అందరూ గట్టిగా నమ్ముతున్నారన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారని తాను, జగన్, ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
జగన్‌ను కలిసిన వారిలో ఆయన భార్య భారతి రెడ్డి, విశ్వరూప్ తనయుడు, మాజీ డిజిపి స్వరణ్‌జిత్ సేన్ సతీమణి, అంబటి రాంబాబు, విజయా రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి తదితరులు ఉన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications