కెటిఆర్పై హైకోర్టు చర్యలు: సాక్షి, ఆంధ్రజ్యోతిలకు నోటీసు

హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ టీఎన్‌జీవో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ నాగార్జున రెడ్డి ఈనెల 14న విచారణ జరిపారు. ఈ సందర్భంగా సర్కారు తీరును న్యాయమూర్తి ప్రశ్నించారు. 'కోట్ల రూపాయల గోల్‌మాల్‌కు పాల్పడిన వారిపై కేసు పెట్టడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?' అని నిలదీశారు.
నిధులు దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలు నిర్ధారణ అయిన తర్వాత కూడా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయిన కొందరు వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని అన్నారు. తప్పు చేసిన సొసైటీ సభ్యులపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీని పిలిపించాలని కూడా ఒక దశలో భావించారు. కెటిఆర్ అదే రోజున మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలను జస్టిస్ నాగార్జున రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది.
ఈ వ్యాఖ్యలు దురుద్దేశాలు అంటగట్టేలా ఉన్నాయంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యకు ఆయన నివేదించారు. ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు చేరింది. కేటీఆర్ వ్యాఖ్యలను నేరపూరిత కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications