వైయస్సార్సీసి శాసనసభా పక్ష నేత వైయస్ విజయమ్మ

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదిహేనుమంది ఎమ్మెల్యేలు, ఒక లోక్‌సభ సభ్యుడు ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆ పార్టీ తరఫున విజయమ్మ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా, జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి శాసనసభ ఆవరణలో కార్యాలయాన్ని కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరనున్నారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇలా ఉండగా పశు సంవర్ధక శాఖ మంత్రి పి విశ్వరూప్ కుమారుడు కృష్ణ బుధవారం చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి విశ్వరూప్ కుమారుడు మొదటి నుంచి జగన్ పట్ల అభిమానంతో ఉంటున్నారు.
జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా పలుమార్లు మంత్రి కుమారుడు ఆయనను కలిశారు. ఆ తర్వాత ఒక సారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రి కుమారుడు కలిసి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. అయినప్పటికీ ఆయన జగన్‌ను జైలుకు వెళ్ళి కలవడం గమనార్హం.












Click it and Unblock the Notifications