జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేయండి: హైకోర్టు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. జగన్ గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిని స్వీకరించిన కోర్టు శుక్రవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. విచారణను 27కు వాయిదా వేసింది.

కాగా జగన్ బెయిల్ పైన సిబిఐ 27వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురయింది. సిబిఐ అక్కడ ఏం వాదనలు వినిపించిందో ఇక్కడా అవే వినిపించే అవకాశముంది. జగన్ ఆస్తుల కేసు కీలక దర్యాఫ్తులో ఉందని, ఇలాంటి సమయంలో జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను బెదిరించే అవకాశముందని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశముంది.

కాగా నిన్న జగన్ బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తన పిటిషన్‌లో జగన్ అనేక అంశాలు పేర్కొన్నారు. తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తొమ్మిది నెలలుగా సిబిఐ తన ఆస్తుల కేసును విచారిస్తోందని, ఇప్పటి వరకు మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసిందని, అప్పటి వరకు తనను విచారించలేదని, కానీ ఉప ఎన్నికల సమయంలో తనను విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసిందని అందులో పేర్కొన్నారు.

ఎంపీని, ఓ పార్టీ అధ్యక్షుడిని అయిన తనను ఉప ఎన్నికల ప్రచార సమయంలోనే సిబిఐ అరెస్టు చేయడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. తాను ప్రచారంలో పాల్గొనకుండానే ఇలా చేశారన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+