హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ జెడి కాల్‌లిస్ట్: ఫిర్యాదు అందలేదన్న డిజిపి దినేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dinesh Reddy
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఫోన్‌కు సంబంధించిన కాల్ డేటా బయటకొచ్చిన వివాదంలో జెడి నుండి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే దర్యాఫ్తు చేపడతామని డిజిపి దినేష్ రెడ్డి శనివారం చెప్పారు. గత ఐదు నెలల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరించేందుకు డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దినేష్ రెడ్డి మాట్లాడారు.

రాష్ట్రంలో నేరాలను అదుపు చేస్తున్నామని చెప్పారు. గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీసుల ప్రతిష్ఠ నానాటికీ పెరుగుతోందని, పోలీసు స్టేషన్‌కు వచ్చేవారు చిరునవ్వుతో తిరిగి వెళుతున్నారని చెప్పుకొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌లను కలిపి ఒకే కమిషనరేట్ చేస్తామన్నారు. రేవ్ పార్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 88 కేసులు నమోదు చేసి.. 117 మందిని అరెస్ట్ చేశామని, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్‌పై చురుగ్గా పని చేసినందుకు కేంద్ర హోంశాఖ ఈ ఏడాది ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రదానం చేసిందని చెప్పారు.

గత మూడేళ్లుగా ఏడాదికి 51 వేల కేసుల చొప్పున లోక్ అదాలత్‌ల్లో పరిష్కరించగా.. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 64,400 కేసులను పరిష్కరించామన్నారు. మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి అధికారులు పట్టుకున్నారన్నారు. రూ.2100 కోట్ల అక్రమాలకు పాల్పడిన స్పీక్ ఏసియా ఆన్‌లైన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి రూ.145 కోట్ల ఆస్తుల ఖాతాలను స్తంభింపజేశామని చెప్పారు.

హిమ్‌కు సంబంధించి 39 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.20.21 కోట్లను రికవరీ చేశామన్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌ల్లో వీడియో పైరసీకి పాల్పడుతున్న సంస్థలపై దాడులు నిర్వహించి 973 తెలుగు, 989 హిందీ సినిమాల సీడీలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 48 పోలీసు స్టేషన్లకు సొంత భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. ప్రజలతో డీజీపీ కార్యక్రమానికి స్పందన బాగుందని, దీనివల్ల జి ల్లాల్లోని పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోందన్నారు.

రాష్ట్రంలో వాహనాల తనిఖీకి శోధకాల(స్కానర్ల)ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పరికరాలతో వాహనాలను ఎక్స్‌రే తీసి లోపలుంటే వస్తువులను గుర్తించవచ్చునని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం, సచివాలయం, రాజ్ భవన్, డిజిపి కార్యాలయాల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమ శాఖ పరిధిలోని భూములలో అవసరమైన చోట్ల కల్యాణ మండపాలు, స్టేడియాలు నిర్మిస్తామని, హోర్డింగులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 100 బస్సుల దహనానికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.

English summary
The overall crime rate has gone up and the detection 
 
 rate has come down in the State in the last six 
 
 months. Addressing a press conference at the State 
 
 Police Headquarters here on Saturday, DGP Dinesh 
 
 Reddy informed that 77,390 cognizable crimes were 
 
 reported this year up to May compared to 73,415 
 
 cases of last year (up to May) registering an 
 
 increase of 5.27 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X