బాబును కలిసేందుకు నో: వ్యూహం మార్చిన లగడపాటి

Chandrababu versus Lagadapati Rajagopal
విజయవాడ: రాజకీయ రాజధాని విజయవాడలో ఫ్లై ఓవర్ నిర్మాణం అంశం ముదురుతోంది. ఫ్లై ఓవర్ అంశంతో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు నగరంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దుర్గగుడి దగ్గర ఫ్లై ఓవర్ నిర్మించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నగరంలో ధర్నా చేపట్టనున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ప్రతిపాదన అని, ప్రభుత్వం దీనిని కట్టడంలో వైఫల్యం చెందుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ బాబు రేపు ధర్నా చేయనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద యెత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా రింగ్ రోడ్డు పనులు పూర్తయ్యాక ప్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ బాబుకు పోటీగా ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. అంతేకాదు చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరిస్తానని చెప్పారు.

లగడపాటి పోటీ ధర్నా, బాబును కలిసే విషయంపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. తమ పార్టీ అధినేతను కలిస్తే తాము ఎట్టి పరిస్థితులలోనూ ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బాబు దీక్షకు పోటీగా లగడపాటి దీక్ష చేపట్టడంపై వారు విమర్శలు చేశారు. టిడిపి నేతల ఎదురుదాడితో లగడపాటి రాజగోపాల్ కొత్త వ్యూహానికి తెరదీశారు.

ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైతే తన సొంత నిధులు ఇస్తానని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అయితే ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+