అపస్మారక స్థితిలో కోర్టుకు జిఎస్ గుప్తా: నో రిమాండ్

ఇలాంటి పరిస్థితిలో గుప్తాను కోర్టుకు ఎలా తీసుకువస్తారని న్యాయమూర్తి హైదరాబాద్ నేర పరిశోధక విభాగం (సిసిఎస్)పోలీసులను ప్రశ్నించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుప్తాను కోర్టుకు తీసుకురావాలని ఆదేశించారు. చాలా కాలంగా పరారీలో ఉన్న పివిఆర్ మాల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరీ శంకర్ గుప్తా ఎట్టకేలకు జూన్ 23వ తేదీన హైదరాబాదు నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు చిక్కాడు.
రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ సంస్థను మోసం చేశారనే ఆరోపణపై గౌరీశంకర్ గుప్తాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సిసిఎఎస్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. గుప్తాకు మినిహా మిగతావారందరికీ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గుప్తా కుటుంబ సభ్యులు బయటే ఉన్నారు. గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లడంతో సిసిఎస్ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు.
గుప్తాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాదులోనూ శివారు ప్రాంతాల్లోనూ భూములు ఇప్పిస్తానని చెప్పి గుప్తా, తదితరులు డిఎల్ఎఫ్ నుంచి 280 కోట్లు రూపాయలు వసూలు చేశారు. మొత్తం ఆరు ప్రాజెక్టులు ఇప్పిస్తానని గుప్తా డిఎల్ఎఫ్‌తో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, గుప్తా తన హామీని నిలబెట్టుకోకపోవడంతో డిఎల్ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో డిఎల్ఎఫ్ సంస్థ పేరు ప్రఖ్యాతులు గాంచింది.












Click it and Unblock the Notifications