ఆరు రోజుల తర్వాత జగన్‌తో ఫ్యామిలీ..: ఈడి విచారణ

చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్ కేసు నిందితులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) మంగళవారం విచారిస్తోంది. ఎమ్మార్ కేసులో రాజేంద్ర ప్రసాద్, సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయ రాఘవలను ఈడి విచారిస్తోంది. ఎమ్మార్ విల్లాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్ట పోయినట్లుగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విల్లాలను, రాజకీయ, పారిశ్రామిక ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొన్నారు.
విల్లాల ఓనర్లు పెద్దమొత్తంలో చెల్లించినప్పటికీ అంత మొత్తాన్ని చూపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి పదుల కోట్లలో నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, ఇంకా పాత్రదారులు ఎవరైనా ఉన్నారా అనే తదితర అంశాలపై ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణ జరుపుతోంది. తాజాగా ఈడి ఈ కేసులో హవాలా ద్వారా వెళ్లిన, వచ్చిన డబ్బుల గురించి ఆరా తీయడానికి నిందితులను ప్రశ్నిస్తోంది.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులలో రిమాండులో ఉన్న నిందితులను ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్(ఈడి) ఆదివారం నుండి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితులను విచారించారు.
ఈ కేసులో అరెస్టై మహిళా జైలులో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, ఓఎంసికి చెందిన బివి శ్రీనివాస రెడ్డిని ఈడి అధికారులు విచారించారు. రెండో రోజు జగన్ కేసులో అరెస్టైన బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాదులను విచారించారు. ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వీరిని ఈడి అధికారులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications