కులాల ఆధారంగా శిక్షణా కేంద్రాలు వద్దు: ముఖ్యమంత్రి

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లడంలో ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక పోషిస్తారని ఆయన అన్నారు. బిసిలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో బిసి సంక్షేమ శాఖ బడ్జెట్‌ను ఈ ఏడాది రూ. 3 వేల 17 కోట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. 1994 - 2004 మధ్య కాలంలో ఏడాదికి రూ. 158 కోట్ల బడ్జెట్ కేటాయించగా, 2004 - 2011 మధ్య కాలంలో బడ్జెట్ కేటాయింపులు రూ. 900 కోట్లకు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారా క్షేత్రస్థాయిలో ఉండే నిజమైన లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ వినియోగంతో మంచి ఫలితాలు సాధిస్తే వచ్చే ఏడాది మరిన్ని ఎక్కువ నిధులు బిసి సంక్షేమ శాఖకు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు .
చదువు కేవలం ఉద్యోగ సముపార్జనకే కాకుండా మనిషి ఆలోచనా విధానాన్ని మెరుగుపరిచే దిశలో జీవితాలను నడిపించేలా సాగాలనే ఉద్దేశంతో బిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు ఆయన తెపిపారు. కులవృత్తులకు కొంత ఆధునికతను జోడించి కులవృత్తిదారులు తమ వృత్తిని కొనసాగించి మెరుగైన జీవనోపాధిని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాధికారులు చొరవ తీసుకుని పని చేయాలని బిసి సంక్షేమ మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు హాస్టల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎకె ఫరీదా, సంచాలకులు ఉమర్ జలీల్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఎన్ కృష్ణ, జిల్లా బిసి సంక్షేమాధికారులు, అసిస్టెంట్ బిసి సంక్షేమ శాఖాధికారులు, బిసి హాస్టల్స్ ప్రిన్సిపాల్స్, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications