రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్రం: హరీష్

అనంతరం కార్మికులను ఆయన ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ కార్మికసంఘాలు జేబీసీసీఐలో తమకే సభ్యత్వం ఉందని కార్మికుల సమస్యలు, హక్కులను తామే పరిరక్షిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇదే జాతీయ సంఘాలు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, ఇన్‌కంట్యాక్స్ రద్దు, వైజాక్‌కు మైనింగ్ యూనివర్శిటీ వెళ్లిపోతే ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సింగరేణి అభివృద్ధి సాధ్యమని, కొత్త బొగ్గుబావులు, కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు. సమైక్యవాద జాతీయ కార్మికసంఘాలకు ఈ ఎన్నికల్లో తెలంగాణావాదులు తగిన గుణపాఠంచెప్పాలని కోరారు. కార్మికులు ఈ ఒక్కసారి తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘాన్ని గుర్తింపు సంఘంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications