వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్‌స్టర్ అబుసలేంకు బెయిల్, ఐనా..: కోర్టు ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abu Salem
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబు సలేంకు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 2002లో బలవంతపు వసూళ్ల కేసులో అబు సలేం అరెస్టయ్యారు. ఈ కేసులో ఈ రోజు ఆయనకు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. జైలులో అబు సలేం ప్రవర్తనను కోర్టు ప్రశంసించింది. జైలులో ఉన్నన్నాళ్లు అతనిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వినోద్ యాదవ్ ఇతనికి బెయిల్ మంజూరు చేశారు.

బెయిల్ మంజూరు చేసినప్పటికీ సలీం జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కేసు కాకుండా మరో ఏడు కేసులు అబు సలీంపై కోర్టులో నడుస్తున్నాయి. దీంతో అతని విడుదలకు అవకాశం లేదు. 2002 బలవంతపు వసూళ్ల కేసులో అబు సలీం ఇప్పటికే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడని, దోషిగా తేలిన ఇతనికి ఏడేళ్ల కారాగార శిక్ష పడిందని జడ్జి చెప్పారు.

సెక్షన్ 436 ఏ ప్రకారం నిందితుడు సగం పీరియడ్‌కు పైగా జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే సాక్ష్యుల నుండి సమాచారం సేకరించినందున, ఇదే కేసులో అరెస్టైన మరో ముగ్గురు నిందితులు చందర్ ప్రకాశ్, సాధిక్ అలీ, ఇస్తియాక్ బెయిల్ పైన విడుదలయినందున... సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని భావిస్తూ బెయిల్ ఇస్తున్నట్లు చెప్పారు.

కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. ఇప్పటికే నిందితుడు సగం కాలం శిక్ష అనుభవించాడని, సాక్ష్యులను విచారించారని.. వీటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇస్తున్నట్లు జడ్జి చెప్పారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నన్ని రోజులు అబు సలేం ప్రవర్తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని జడ్జి చెప్పారు.

English summary
Extradited gangster Abu Salem was today granted bail in a 2002 extortion case by a Delhi Court, which also praised his “above board” conduct in jail. Chief Metropolitan Magistrate Vinod Yadav granted him bail on a personal bond of Rs 1 lakh and a surety of like amount. Salem would, however, still be in jail as he is facing trial in seven other cases for which he was extradited to India from Portugal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X