రాష్ట్రంలో ఈ ఏడాది 25 భారీ పరిశ్రమలు: గీతా రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర పెట్టుబడులు, ప్రొత్సాహక మండలి ఉన్నత స్థాయి సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారు. కొత్త పరిశ్రమలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఏర్పాటవుతున్నాయన్న విమర్శలకు చెక్ పెడుతూ కొత్త వాటిని 12 జిల్లాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు గీతారెడ్డి తెలిపారు.
కొత్తగా ఆమోదించిన వాటిలో 13 సిమెంట్, 6 కెమికల్ పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. ఫ్లాస్టిక్, స్టీల్ ఇతర రంగాలకు సంబంధించి ఒక్కో పరిశ్రమ ఉన్నట్లు గీతారెడ్డి వెల్లడించారు. గత ఏడాది ఆమోదించిన 44 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 14 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని అన్నారు. మిగిలిన 27 పరిశ్రమలు వివిధ దశలలో ఉన్నాయని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications