ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై శంకర్ దాదా ఫైర్

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన వీరభద్ర సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సహా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన సలహా ఇచ్చారు. డిజిపి నియామకంపై క్యాట్ తీర్పును గౌరవించాలని ఆయన అన్నారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటనపై వాస్తవాలు తెలియాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లక్ష్మీపేట ఘటనపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రజావసరాలు తెలుసుకుని మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం వల్లనే కాంగ్రెసు పార్టీ ఓడిపోయిందని తాను సోనియా గాంధీకి చెప్పినట్లు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం సాయంత్రం సోనియాను కలిశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని తాను సోనియాకు చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications